భారతదేశం, అక్టోబర్ 4 -- భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్‌కు ఊహించని చట్టపరమైన చిక్కులు ఎదురయ్యాయి. 2006లో ఆయన కేరళ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (పీడబ్ల్యూడీ) కార్యదర్శిగా వ్యవహరించిన సమయంలో జరిగిన కేఎస్టీపీ రోడ్డు నిర్మాణ ప్రాజెక్టు అవినీతి ఆరోపణలపై విజిలెన్స్, యాంటీ కరప్షన్ బ్యూరో (వీఏసీబీ) విచారణకు కేరళ ప్రభుత్వం జారీ చేసింది.

కాంగ్రెస్ నాయకుడు మలయంకీళ్ వేణుగోపాల్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఈ విచారణకు ఆదేశించినట్లు కేరళ హోం మంత్రి రమేష్ చెన్నితల వెల్లడించారు. 2006లో కేరళ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ ప్రాజెక్ట్ (కేఎస్టీపీ) కింద చేపట్టిన ఎమ్‌‌సీ రోడ్డు విస్తరణ పనులను 'పాటి-బెల్' (PATI-BEL) కన్సార్షియం దక్కించుకుంది. ఆ సమయంలో జ్ఞానేశ్ కుమార్ పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ప్రాజెక్ట్ పర్యవేక్షణ బాధ్యతలు చూశారు. అయితే భూసేకరణ జాప్యం, ...