భారతదేశం, సెప్టెంబర్ 4 -- Hanuman Ansh Director Vishal Chaturvedi On Bollywood: చిత్రసీమలో ఒక్కోసారి ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చే చిన్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద సృష్టించే ప్రభంజనం సామాన్యంగా ఉండదు. ఇటీవల కన్నడ స్టార్ యశ్ నటించిన 'టాక్సిక్' వంటి భారీ చిత్రాల హవా నడుస్తున్న సమయంలోనూ, సైలెంట్‌గా వచ్చి థియేటర్లలో తుపాను సృష్టిస్తోంది 'హనుమాన్ అంశ్'.

కేవలం రూ.2 కోట్ల పరిమిత బడ్జెట్‌తో రూపొందిన హనుమాన్ అంశ్ చిత్రం ప్రస్తుతం 4వ వారంలోనూ తగ్గకుండా రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. మొదటి రోజు కేవలం రూ.10 లక్షల వసూళ్లతో మొదలైన ఈ సినిమా ప్రయాణం ఆ తర్వాత ఊహించని మలుపు తిరిగింది.

మల్టీప్లెక్స్ దిగ్గజాలైన పీవీఆర్, సినీపోలిస్ వంటి సంస్థలు ఆరంభంలో ఈ చిన్న సినిమాను ప్రదర్శించేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. భారీ సినిమాల కోసం 'హనుమాన్ అంశ్' షోలను 250...