భారతదేశం, డిసెంబర్ 24 -- భారత గగనతలంపై మరిన్ని కొత్త విమానాలు రెక్కలు విప్పనున్నాయి. దేశీయ విమానయాన రంగంలో పోటీని పెంచుతూ, ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించే లక్ష్యంతో కేంద్ర పౌర విమానయాన శాఖ రెండు కొత్త విమానయాన సంస్థలకు అనుమతులు మంజూరు చేసింది. అల్ హింద్ ఎయిర్ (Al Hind Air), ఫ్లై ఎక్స్‌ప్రెస్ (FlyExpress) సంస్థలకు బుధవారం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్లు (NOC) లభించినట్లు కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.

ప్రస్తుతం భారత దేశీయ విమానయాన మార్కెట్‌లో ఇండిగో, ఎయిర్ ఇండియా గ్రూప్ సంస్థలే 90 శాతానికి పైగా వాటాను కలిగి ఉన్నాయి. ఈ ఆధిపత్యాన్ని తగ్గించి, మార్కెట్‌లో ఆరోగ్యకరమైన పోటీని నెలకొల్పాలని ప్రభుత్వం భావిస్తోంది.

"గత వారం రోజుల్లో కొత్త విమానయాన సంస్థల ప్రతినిధులను కలిశాను. శంఖ్ ఎయిర్ ఇప్పటికే NOC పొందగా, ఈ ...