భారతదేశం, డిసెంబర్ 19 -- థియేటర్లలో విడుదలైన సమయంలో చర్చకు దారితీసిన తెలుగు రొమాంటిక్ ఎమోషనల్ కామెడీ డ్రామా 'సంతాన ప్రాప్తిరస్తు' ఓటీటీలోకి అడుగుపెట్టింది. నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సరిగ్గా నెల రోజులకు డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులోకి రావడం విశేషం.

సంజీవ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సంతాన ప్రాప్తిరస్తు సినిమాలో విక్రాంత్, చాందిని చౌదరి ప్రధాన పాత్రలు పోషించారు. తెలుగు సినిమాల్లో సాధారణంగా చర్చకు రాని 'పురుషుల వంధ్యత్వం' (Male Infertility) లేదా స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉండటం వంటి అతి సున్నితమైన అంశం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో చైతన్య (విక్రాంత్) ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కొంచెం సిగ్గు, మొహమాటస్తుడైన చైతన్య జీవితంలోకి కల్యాణి (చాందిని చౌదరి) ప్రవేశిస్తుంది. వీరిద్దరి మధ్య పరిచయ...