భారతదేశం, ఆగస్టు 20 -- హైదరాబాద్: నగరంలో డ్రగ్స్ స్మగ్లర్ల ఆగడాలను అడ్డుకోవడంలో హైదరాబాద్ పోలీసులు మరోసారి విజయం సాధించారు. దాదాపు 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను డీసీపీ (సెంట్రల్ జోన్) కె. శిపవల్లి మీడియాకు వెల్లడించారు.

మంగళవారం రోజున దోమలగూడలోని లిబర్టీ టీ జంక్షన్ సమీపంలో గల అంబేద్కర్ కాలనీలో ఉన్న సూరజ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ ముందు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారి చేతుల్లో రెండు ట్రావెల్ బ్యాగులు ఉన్నాయి. ఈ విషయాన్ని గమనించిన దోమలగూడ పోలీసులు వారిని పట్టుకొని తనిఖీ చేశారు. ఆ బ్యాగులలో 18 కిలోల గంజాయిని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టు అయిన ఇద్దరు నిందితులను కొమల్ సోమినాథ్ పవార్ (23), సాహిల్ మహేష్ సలుంకే (18)గా పోలీసులు గుర్తించారు. వీరు ఇ...