భారతదేశం, ఏప్రిల్ 10 -- లెజెండరీ మోటార్‌సైకిల్ బ్రాండ్ రాయల్ ఎన్‌ఫీల్డ్ ఎట్టకేలకు ఎలక్ట్రిక్ వాహన రంగంలోకి అడుగుపెట్టింది! తన తొలి ఎలక్ట్రిక్ బైక్ 'ఫ్లయింగ్ ఫ్లీ సీ6'ని భారత మార్కెట్​లో గురువారం అధికారికంగా విడుదల చేసింది. వింటేజ్ లుక్‌తో పాటు అత్యాధునిక టెక్నాలజీ కలబోతగా వచ్చిన ఈ ఎలక్ట్రిక్ బైక్.. ముఖ్యంగా నగరవాసులను ఆకట్టుకునేలా రూపొందించారు.

ఈ నేపథ్యంలో ఈ రాయల్​ ఎన్​ఫీల్డ్​ ఫ్లయింగ్​ ఫ్లీ సీ6 ధర, రేంజ్​ సహా పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్​గా తెలుసుకోండి..

ఫ్లయింగ్ ఫ్లీ సీ6 ఎక్స్-షోరూమ్ ధరను రూ. 2.79 లక్షలుగా నిర్ణయించారు. అయితే, కంపెనీ ప్రవేశపెట్టిన 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' (బీఏఏఎస్) ఆప్షన్‌ను ఎంచుకుంటే, దీనిని కేవలం రూ. 1.99 లక్షలకే సొంతం చేసుకోవచ్చు.

ఈ బైక్ బుకింగ్స్ నేడు (ఏప్రిల్ 10, 2026) మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నా...