భారతదేశం, అక్టోబర్ 25 -- రిటైర్మెంట్ సమయానికి చేతిలో రూ.కోటి నిధి ఉంటే జీవితం నిశ్చింతగా ఉంటుంది. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ వంటి నగరాల్లో నివసించే సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఇది ఒక పెద్ద కల. అయితే నెలకు కొంత కొంత చొప్పున క్రమశిక్షణతో పెట్టుబడి పెడితే ఈ రూ.కోటి లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. మ్యూచువల్ ఫండ్స్​లో సంపద సృష్టికి అత్యంత ప్రజాదరణ పొందిన '15-15-15 ఫార్ములా'ను ఉపయోగించాలని సూచిస్తున్నారు.

సాధారణ పొదుపు ఖాతాలు లేదా ఫిక్స్‌డ్ డిపాజిట్లలో డబ్బులు దాచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అధిగమించడం కష్టం. కానీ స్టాక్ మార్కెట్ ఆధారిత సిప్​లలో పెట్టుబడి పెట్టడం వల్ల దీర్ఘకాలంలో చక్రవడ్డీ లాభాలు అందుతాయి.

ఇక ఈ 15-15-15 సూత్రాన్ని సులభంగా అర్థం చేసుకోవడానికి దీనిని మూడు '15'లుగా విభజించారు:

మొదటి 15:...