భారతదేశం, జనవరి 4 -- డిసెంబర్ 5న థియేటర్లలో విడుదలైనప్పటి నుండి ధురంధర్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ స్పై థ్రిల్లర్ 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. అంతే కాకుండా తాజాగా రూ.1200 కోట్ల క్లబ్‌లోనూ చేరింది. ఈ చిత్రంతోనే రణ్ వీర్ సింగ్‌కు జోడీగా బాలీవుడ్ అరంగేట్రం చేసింది హీరోయిన్ సారా అర్జున్.

ధురంధర్ సినిమా విజయంపై సారా అర్జున్ హృదయపూర్వక సందేశం వైరల్ గా మారింది. ప్రేక్షకులు చూపిన అపారమైన ప్రేమ, మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో సారా సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారు.

''నా బలమైన 'ధురంధర్లు' - ప్రేక్షకులు. చాలా కాలంగా సుదీర్ఘ కథనాల (లాంగ్ రన్ టైమ్ మూవీస్)పై ప్రేక్షకులు సహనం చూపడం లేదని, చూసే స్థాయి తగ్గిపోయిందని, ఈ సినిమాలకు ఇక చోటు లేదని ఒక అభిప్రాయం ఉంది. కానీ మ...