భారతదేశం, అక్టోబర్ 21 -- భారత సముద్ర రవాణా రంగాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. దేశంలో ఉన్న 12 ప్రధాన ఓడరేవులలో 11 పోర్టులను 2030 నాటికి వాణిజ్యపరంగా నడిచే కార్పొరేట్ సంస్థలుగా మార్చాలని ప్రతిపాదించింది. ఈ ప్రక్రియ ద్వారా పోర్టులకు స్వయంప్రతిపత్తి పెరగడమే కాకుండా, నిర్ణయాధికారం వేగవంతమై మార్కెట్ ఆధారిత రుసుములను నిర్ణయించే వెసులుబాటు లభిస్తుంది. తదనంతర కాలంలో ఈ సంస్థలను స్టాక్ మార్కెట్లలో లిస్ట్ చేయాలని భావిస్తున్నారు. పోర్టు భూములు, తీర ప్రాంత నియంత్రణ హక్కులను ప్రభుత్వం తన వద్ద ఉంచుకుంటూనే, ప్రొఫెషనల్ బోర్డులతో వీటిని నిర్వహించడం ద్వారా ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుతం ఓడరేవులు చట్టబద్ధమైన ట్రస్టులు లేదా అథారిటీల రూపంలో పనిచేస్తున్నాయి. దీనివల్ల నిధుల...