భారతదేశం, ఫిబ్రవరి 16 -- తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అత్యధిక స్థానాలు వచ్చాయి. ఏడు కార్పొరేషన్లలో ఆరు కార్పొరేషన్లను సొంతం చేసుకుంది. అయితే కొత్తగూడెంలో మేయర్ పీఠాన్ని సీపీఐతో కలిసి దక్కించుకుంది. ఇక కరీంనగర్‌లో ఎంతో ఉత్కంఠ నెలకొన్న చివరకు.. బీజేపీ మేయర్ కుర్చీపై కూర్చుంది. మున్సిపల్ ఛైర్మన్ల విషయానికి వస్తే.. హస్తం పార్టీ హవా చూపించింది.

105 మున్సిపాలిటీల్లో ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక ప్రక్రియ ముగిసింది. ఇందులో 84 కాంగ్రెస్‌ సొంతం చేసుకుంది. 17 బీఆర్‌ఎస్‌ ఖాతాలోకి వెళ్లాయి. బీజేపీ ఒక్క మున్సిపాలిటీని సాధించింది. ఇక మూడు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఛైర్మన్లుగా ఎన్నికయ్యారు. బైంసా, కామారెడ్డి, ఆదిలాబాద్‌లో ఇండిపెండెంట్లుగా మున్సిపల్ ఛైర్ పర్సన్ సీట్లలో కూర్చున్నారు. 36 స్థానాల్లో హంగ్ ఏర్పడింది. కానీ వివిధ పార్టీల మధ...