భారతదేశం, జనవరి 20 -- స్మార్ట్‌ఫోన్ మార్కెట్​లో రియల్​మీ మరో సంచలనానికి సిద్ధమైంది. 'రియల్​మీ పీ4 పవర్ 5జీ' పేరుతో సరికొత్త హ్యాండ్‌సెట్‌ను భారత్‌లో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఇందులో 10,000 ఎంఏహెచ్​ భారీ బ్యాటరీ ఉండటం హైలైట్​. లాంచ్ తేదీని కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ, జనవరి 29న ఇది మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ గ్యాడ్జెట్​కి సంబంధించి ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి.

ఆన్‌లైన్‌లో లీక్ అయిన రిటైల్ బాక్స్ ఫోటో ప్రకారం.. రియల్​మీ పీ4 పవర్​ 12జీబీ ర్యామ్​, 256జీబీ స్టోరేజ్ (టాప్-ఎండ్ వేరియంట్) ధర రూ. 37,999గా ఉంది. అయితే, సాధారణంగా బాక్స్‌పై ఉన్న ధర కంటే అసలు మార్కెట్ ధర చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి, ఈ ఫోన్ మరింత అందుబాటు ధరలోనే లభించే అవకాశం ఉంది.

ఫ్లిప్‌కార్ట్ మైక్రో...