భారతదేశం, జూలై 3 -- 100 Days Of Lies OTT Teaser Released: తెలుగురాష్ట్రాల్లో కొరియన్ డ్రామాలకు ఉన్న ఆదరణ రోజురోజుకూ పెరుగుతోంది. 'డాక్టర్ రొమాంటిక్', 'ఎక్స్‌ట్రార్డినరీ అటార్నీ వూ' వంటి విలక్షణమైన ఫీల్ గుడ్ డ్రామాలతో తెలుగు ప్రేక్షకులకు సైతం బాగా కనెక్ట్ అయిన ప్రముఖ సౌత్ కొరియన్ డైరెక్టర్ యూ ఇన్ షిక్ ఈసారి సరికొత్త జోనర్‌ను ఎంచుకున్నారు.

ప్రేమ, యాక్షన్, సస్పెన్స్ ఎలిమెంట్స్ కలగలిపిన ఓ పీరియాడిక్ స్పై థ్రిల్లర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్ '100 డేస్ ఆఫ్ లైస్' (100 Days of Lies) ఫస్ట్ టీజర్‌ను జూలై 2న కొరియన్ నెట్‌వర్క్ టీవీఎన్ విడుదల చేసింది. ఈ గ్లోబల్ అప్‌డేట్‌తో అక్టోబర్‌లో రాబోయే ఈ ప్రతిష్టాత్మక ఓటీటీ సిరీస్‌పై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ కథ 1932 నాటి గియాంగ్‌ సియాంగ్ (ప్ర...