భారతదేశం, నవంబర్ 29 -- స్టాండప్ కమెడియన్ సమయ్ రైనా యూట్యూబ్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల పెయిడ్ ఛానల్ మెంబర్‌షిప్‌లు దాటిన తొలి యూట్యూబ్ క్రియేటర్‌గా నిలిచాడు. గూగుల్ ఇండియా బ్లాగ్‌లో యూట్యూబ్ బృందం ఈ వివరాలను పంచుకుంది. "సమయ్‌కు ఇది అసాధారణ మైలురాయి, దేశంలోని క్రియేటర్ వ్యవస్థ మొత్తానికి గర్వకారణమైన క్షణం" అని యూట్యూబ్ బృందం పేర్కొంది.

యూట్యూబ్ ఛానల్‌కు సబ్‌స్క్రైబ్ చేయడం ఉచితం. దీనివల్ల వీక్షకులు తమకు నచ్చిన క్రియేటర్ పబ్లిక్ వీడియోలను సులభంగా చూడగలరు. పెయిడ్ ఛానల్ మెంబర్‌షిప్ అలా కాదు. 'జాయిన్' బటన్ ద్వారా నిర్దిష్ట క్రియేటర్ చానల్‌కు ప్రతి నెలా రుసుము చెల్లించి చేరాలి. మెంబర్‌షిప్ తీసుకున్నవారికి మెంబర్స్-ఓన్లీ వీడియోలు, ప్రత్యేక లైవ్ చాట్‌లు, కస్టమ్ ఎమోజీలు, కామెంట్ బ్యాడ్జ్‌లు లభిస్తాయి. యూట్యూబ్ ప్రీమియం...