భారతదేశం, డిసెంబర్ 25 -- టెక్ దిగ్గజం ఓప్పో తన టాబ్లెట్ శ్రేణిని మరింత విస్తరిస్తూ 'ఓప్పో ప్యాడ్ ఎయిర్ 5'ని చైనా మార్కెట్లో ఆవిష్కరించింది. ఎడ్యుకేషన్​, ఎంటర్​టైన్​మెంట్​, మల్టీ టాస్కింగ్ కోసం వెతుకుతున్న వారిని దృష్టిలో పెట్టుకుని ఈ సరికొత్త టాబ్లెట్‌ను రూపొందించింది. ఆకర్షణీయమైన డిజైన్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను ఇందులో జోడించారు. ఈ నేపథ్యంలో ఈ మోడల్​ ఫీచర్స్​, ధర వంటి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

8జీబీ + 128జీబీ: సుమారు రూ. 24,000 (1,899 యువాన్​)

8జీబీ + 256జీబీ: సుమారు రూ. 28,000 (2,199 యువాన్​)

12జీబీ + 256జీబీ: సుమారు రూ. 32,000 (2,499 యువాన్​)

ఇదే ర్యామ్​, స్టోరేజ్​లతో కూడిన ప్రత్యేకమైన 'సాఫ్ట్ లైట్' వెర్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. వీటి ధర సుమారు రూ. 31,000 నుంచి ప్రారంభమవుతుంది. డిసెంబర్ 31 నుంచి ఇవి అధికారికంగా సేల్...