భారతదేశం, అక్టోబర్ 18 -- Vishwak Sen #Cult Trailer Released: టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మరోసారి తన విభిన్నమైన మేకింగ్ శైలితో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యాడు. విశ్వక్ సేన్ స్వయంగా దర్శకత్వం వహిస్తూ, కథ అందించి, హీరోగా నటించిన సరికొత్త స్లాషర్ థ్రిల్లర్ చిత్రం '#CULT' (కల్ట్).

తారక్ సినిమాస్ పతాకంపై సందీప్ కాకరాల నిర్మించిన #కల్ట్ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. మొదటి సన్నివేశం నుంచే తీవ్రమైన ఉత్కంఠను రేకెత్తిస్తున్న ఈ #కల్ట్ ట్రైలర్, సోషల్ మీడియా వేదికలపై తెగ హల్‌చల్ చేస్తోంది.

గతంలో 'ఫలక్‌నుమా దాస్', 'దాస్ కా ధమ్కీ' చిత్రాలతో స్వీయ దర్శకత్వంలో తన సత్తా నిరూపించుకున్న విశ్వక్ సేన్, ఈసారి తెలుగుతెరకు కాస్త కొత్తదైన 'స్లాషర్ థ్రిల్లర్' జోనర్‌ను ఎంచుకున్నారు. కేవలం నటనకే పరిమితం కాకుండా, కథనంపై పూర్తి...