Telangana,delhi, జూలై 31 -- పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలంటూ దాఖలపైన పిటిషన్లపై సుప్రీంకోర్టు కీలక తీర్పును వెలువరించింది. 3 నెలలలోపు స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఫిరాయింపులను ఆరికట్టకపోతే దానికి ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి ఉంటుందని వ్యాఖ్యానించింది.

ఎమ్మెల్యేల అనర్హత వేటు విషయంలో సాధ్యమైనంత త్వరగా లేదా మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. తీర్పు సందర్భంగా సీజేఐ బెంచ్ పలు అంశాలను ప్రస్తావించింది. "రాజకీయ ఫిరాయింపులు జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. వాటిని అరికట్టకపోతే ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసే శక్తి దానికి ఉంది. మేము ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకుంటే రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడినట్టు అవుతుంది. అంద...