భారతదేశం, జూలై 14 -- గల్ఫ్ దేశాల్లో ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను వణకిస్తున్నాయి. అమెరికా-ఇరాన్ సంక్షోభం నడుమ, వ్యూహాత్మకంగా అత్యంత కీలకమైన 'బాబ్ అల్-మందేబ్' జలసంధిని మూసివేస్తామని యెమెన్ సంచలన హెచ్చరిక చేసింది. అదే జరిగితే అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు (క్రూడాయిల్) ధర బ్యారెల్‌కు ఏకంగా 200 డాలర్లకు చేరే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.

యెమెన్‌కు చెందిన అన్సరుల్లా (హుతీ) ఉద్యమ రాజకీయ విభాగ సభ్యుడు మహ్మద్ అల్-ఫరా ఈ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఇరాన్ ప్రభుత్వ అనుబంధ మీడియా సంస్థ 'ప్రెస్ టీవీ' ఈ వివరాలను వెల్లడించింది. తమ దేశంలోని పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా దాడులను కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.

"పరిస్థితులు ఇలాగే ముదిరితే, వ్యూహాత్మక కూటమి ద్వారా బాబ్ అల్-మందేబ్, హార్ముజ్ జలసంధుల...