Telangana, ఆగస్టు 6 -- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరోసారి ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన భాష మార్చుకోవాలన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు.

సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.తనకు మంత్రి పదవి విషయంలో హైకమాండ్ ప్రామిస్ చేసిందన్న ఆయన.... అందరూ కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు.

"20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణ ను దోచుకుంటుంన్నారు. ఇంకా మూడున్నరేళ్ళు రేవంత్ రెడ్డే ముఖ్యమంత్రి. ఆ తర్వాత ఎవరు అనేది అప్పుడు చూద్దాం. అందరం కలిస్తేనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. సోషల్ మీడియా విషయం లో ఓడ దాటే వరకు ఓడ మల్లన్న.. ఓడ దాటిన తర్వాత బోడ మల్లన్న అన్నట్లు ఉంది" అంటూ కో...