భారతదేశం, జూన్ 4 -- ఎన్నికల హామీలను నెరవేర్చకుండా కూటమి ప్రభుత్వం ఏడాది కాలంగా ప్రజలను మోసం చేసిందని, దీనిని ప్రశ్నిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ ఇచ్చిన 'వెన్నుపోటు దినం' పిలుపునకు అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి ర్యాలీల్లో పాల్గొని తమ ఆగ్రహాన్ని ప్రదర్శించారని పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
ఈ శాంతియుత ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేసిందని, పలువురు పార్టీ నాయకులను హౌస్ అరెస్ట్‌ల పేరుతో వేధించిందని ఆయన మండిపడ్డారు. ఏడాది పాలనపై ప్రజల్లోని తీవ్ర వ్యతిరేకతను ఈ 'వెన్నుపోటు దినం' చాటిందని సజ్జల స్పష్టం చేశారు.
చంద్రబాబు మూడు పార్టీలను కూడగట్టుకుని, అమలు చేయలేని హామీలను ప్రజల ముందు పెట్టి అధికారంలోకి వచ్చారని సజ్జల విమర్శించారు. ప్రజలను భ్రమల్లో పెట్టి అధికారంలోకి వచ్చి ఏడాదిలోనే చంద్రబాబ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.