Telangana,hyderabad, ఆగస్టు 1 -- బనకచర్ల ప్రాజెక్ట్ పై ఏపీ, తెలంగాణ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు ఘాటుగా స్పందిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కు వ్యతిరేకంగా లేఖలు రాసిన చరిత్ర చంద్రబాబుకు ఉందని గుర్తు చేశారు.

"అధికారం ఉందని, మంద బలం ఉందని లోకేష్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడు. బనకచర్ల ప్రాజెక్టు అక్రమ ప్రాజెక్టు కాకపోతే డీపీఆర్ ను కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఎందుకు వాపస్ పంపాయ్..? ఆంధ్రా మంత్రి లోకేష్ బనకచర్ల ప్రాజెక్టు కట్టి తీరుతం అంటుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు? రేవంత్, కాంగ్రెస్ మంత్రులు ఎందుకు మాట్లాడడం లేదు?" అని హరీశ్ రావ్ ప్రశ్నించారు.

"మీరు లోపాయికారి ఒప్పందం చేసుకున్నారు కాబట్టే. మీ ధైర్యం చూసుకొని లోకేష్ అలా మాట్లాడుతున్నాడు. బనకచర్లపై చం...