Andhrapradesh, ఆగస్టు 13 -- వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలోని ఓటింగ్ వ్యత్యాసాల గురించి ఎందుకు మాట్లాడటం లేదు? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు.ఆయన తో టచ్ లో ఉన్నందుకే మాట్లాడటం లేదని చెప్పుకొచ్చారు.

బుధవారం మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్.. చంద్రబాబుతో రాహుల్‌ గాంధీ హాట్‌లైన్‌లో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. అరవింద్ కేజ్రీవాల్ గురించి రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు? కేజ్రీవాల్ స్వయంగా ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓడిపోయారని గుర్తు చేశారు. చిత్తశుద్ధి లేని రాహుల్ గాంధీ గురించి నేనేం చెప్పాలి? అంటూ వైఎస్ జగన్ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.

"ఢిల్లీలో ఓటు బ్యాంక్ గురించి మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించిన దానికి, లెక్కించిన దానికి మధ్య 12.5 శాతం ఓట్ల వ్యత్యాసం ఉంది. దీన...