Hyderabad, Oct. 26 -- రాష్ట్రానికి 'మొంథా' తుఫాను పొంచివున్న నేపథ్యంలో అన్ని జిల్లాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. యూఏఈ పర్యటనలో ఉన్న చంద్రబాబు… అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో పాటు ఉన్నతాధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈనెల 26, 27, 28, 29 తేదీల్లో తుఫాన్ తీవ్ర ప్రభావం చూపించనుందని… ఐఎండీ హెచ్చరికలు కూడా ఇచ్చిందన్నారు.

తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా వ్యవహరించాలని సీఎం సూచించారు. ప్రధానంగా ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో ‘మొంథా’ తీవ్ర తుపానుగా మారి తీరం దాటుతుందని… ఆ సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నందున ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా నుంచి తిరుపతి వరకూ దీని ప్రభావం ఉంటుందని... 80 నుంచి 100 మి.మీ. మేర భారీ వర్షాలు కురిసే...