Telangana,mulugu, సెప్టెంబర్ 18 -- తెలంగాణ కుంభ‌మేళాగా పిలుచుకొనే మేడారం జాత‌ర‌కు సంబంధించిన మాస్టర్ ప్లాన్ పై మంత్రులు కీలక ప్రకటన చేశారు. ఆదివాసీ గిరిజ‌న సంస్కృతీ సాంప్ర‌దాయాల‌కు అనుగుణంగా స‌మ్మ‌క్క సార‌ల‌మ్మ గ‌ద్దెల ఆధునీక‌ర‌ణ‌, భ‌క్తుల‌కు సౌక‌ర్యాలు వంటి ప్రాధాన్య‌తా అంశాల‌తో కూడిన మాస్ట‌ర్ ప్లాన్‌కు తుదిరూపు ఇవ్వ‌డం జ‌రిగింద‌ని వ‌రంగ‌ల్ ఇన్‌ఛార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

ఈ మాస్ట‌ర్ ప్లాన్‌కు ముఖ్య‌మంత్రి రేవంత్‌ రెడ్డి.. ఆమోదం ల‌భించిన వెంట‌నే ఆధునీక‌ర‌ణ ప‌నులు ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి పేర్కొన్నారు. వంద‌ రోజుల్లోగా ప‌నులు పూర్తి చేసేలా కార్యాచ‌ర‌ణ రూపొందిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. ల‌క్షలాది మంది భ‌క్తుల‌కు మెరుగైన ద‌ర్శ‌నం, ఇత‌ర సౌక‌ర్యాలు ల‌భించే విధంగా అంగుళం తేడా లేకుండా శాస్త్రోప‌క‌రంగా సమ్మక్క సార‌...