భారతదేశం, జనవరి 1 -- చిత్తూరు జిల్లా కుప్పం ప్రాంతాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తున్నారని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అన్నారు. ప్రాంతీయ వాణిజ్యాన్ని పెంచేలా కుప్పం ఎయిర్ పోర్ట్ ఉంటుందని చెప్పారు. శాంతిపురం మండలం దండికుప్పం గ్రామంలో రైతులతో గ్రామసభలో ఆయన మాట్లాడారు.

కుప్పం నియోజకవర్గంలో ప్రతిపాదిత విమానాశ్రయానికి భూమిని అందించడానికి శాంతిపురం, రామకుప్పం మండలాల చాలా మంది రైతులు ఇష్టపూర్వకంగా ముందుకు వచ్చారని కలెక్టర్ సుమిత్ పేర్కొన్నారు. వారికి న్యాయమైన పరిహారం, ఇళ్ళు, భూములు, పశువుల రక్షణతో సహా పూర్తి మద్దతును అందిస్తామని హామీ ఇచ్చారు. భూమిని కోల్పోయే రైతులకు అర్హత ఉన్న అన్ని ప్రయోజనాలు అందేలా చూడటానికి ప్రభుత్వానికి వివరణాత్మక నివేదికను సమర్పించనున్...