భారతదేశం, జనవరి 26 -- గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బెదిరింపు లేఖ వచ్చింది. అందులో అసభ్యకరమైన భాష ఉంది. తనపై పోలీసులు చర్యలు తీసుకోలేరని ఆ వ్యక్తి చెప్పడం కలకలం రేపుతోంది. ఆసిఫ్ నగర్‌కు చెందిన అబ్దుల్ హఫీజ్ అనే వ్యక్తి పేరుతో ఈ లేఖ వచ్చింది. గతంలోనూ రాజాసింగ్‌కు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు లేఖ రావడం చర్చనీయాంశమైంది. ఆ లేఖలో 'నాకు పోలీసుల మద్దతు ఉంది. నన్ను ఏం చేయలేరు.' అని రాసి ఉంది.

ఈ ఘటనపై రాజాసింగ్ మాట్లాడుతూ.. 'ఆదివారం సాయంత్రం నా ఇంటి చిరునామాకు బెదిరింపు లేఖ వచ్చింది. బెదిరింపు కాల్స్ చేసి, బెదిరింపు లేఖలు పంపుతున్న వారు ఎవరు అని తెలుసుకోవాలని డీజీపీకి, కమిషనర్‌కు, ముఖ్యమంత్రికి కూడా లేఖలు రాశాం. వారిని పట్టుకోమని మేం కోరాం. కానీ పోలీసులు ఈ రోజు వరకు ఒక్క వ్యక్తిని కూడా పట్టుకోలేదు.' అని రాజాసింగ్ అన్నారు.

నిన్న సాయంత్రం వ...