Andhrapradesh, అక్టోబర్ 5 -- కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పూర్వోదయ స్కీంను రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. పూర్వోదయ మిషన్ లో భాగంగా వ్యవసాయ అనుబంధం రంగాల్లో రూపొందించుకోవాల్సిన ప్రణాళికలపై సీఎం చంద్రబాబు శనివారం క్యాంప్ కార్యాలయంలో సమీక్షించారు. ఉద్యాన పంటలు, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి, తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

ఆయా రంగాల్లో అభివృద్ధి సాధించడంతో పాటు.. వాటిపై ఆధారపడిన వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యేలా చూడాలన్నారు. ఉత్పత్తులకు విలువ జోడించడం ద్వారా మార్కెట్ పరిధిని విస్తరించాలని.. అలాగే రాష్ట్రాభివృద్ధికి మరింతగా తోడ్పడేలా ఉద్యాన, మైక్రో ఇరిగేషన్, ఫిషరీస్, ఆక్వా, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను అభివృద్ధి చేయ...