భారతదేశం, మే 21 -- కుటుంబ కలహాలు, మరోవైపు క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకున్నాయి. కన్నబిడ్డలను చూడాలనే ఆరాటంతో వచ్చిన ఓ తండ్రి.. భార్య, బావమరిది చేతుల్లోనే దారుణ హత్యకు గురైన విషాద ఘటన హైదరాబాద్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

పోలీసుల వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా యాలాల మండలం హజీపూర్‌కు చెందిన గురు వెంకటేశ్ (31)కు, మహబూబ్‌నగర్ జిల్లా మల్కాపూర్‌కు చెందిన స్వప్నకు 2015లో ప్రేమ వివాహం జరిగింది. ఎస్‌ఆర్ నగర్‌లో కాపురం పెట్టిన ఈ దంపతులకు ఒక కుమార్తె, ఒక కుమారుడు జన్మించారు. అయితే వెంకటేశ్‌కు ఉన్న మద్యం అలవాటు వల్ల ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో మనస్పర్థలు తీవ్రమవడంతో నాలుగేళ్ల క్రితం దంపతులిద్దరూ విడిపోయారు. అప్పటి నుంచి స్వప్న తన పిల్లలతో కలిసి వనస్థలిపురంలోని ...