భారతదేశం, అక్టోబర్ 2 -- రాష్ట్రంలో ఏకంగా రూ.1 లక్ష కోట్ల బారీ పెట్టుబడితో కంప్రెస్డ్ బయో గ్యాస్ (CBG) ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రంలో 3 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు.. రాబోయే దశాబ్ద కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దాదాపు రూ. 60,000 కోట్ల ఆదాయం సమకూరనుందని రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనంత్ అంబానీ వెల్లడించారు.

అన్నమయ్య జిల్లా మదనపల్లెలో శుక్రవారం నిర్వహించిన "రాయలసీమ హార్టికల్చర్ హబ్", "ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్" శంకుస్థాపన మహోత్సవంలో ముఖ్యమంత్రి ]చంద్రబాబు నాయుడితో కలిసి అనంత్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం కావడంపై హర్షం వ్యక్తం చేశారు.

వ్యవసాయ రంగంలో విప...