Telangana,hyderabad, ఆగస్టు 2 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం స్పెషల్ ఫేజ్ రిజిస్ట్రేషన్లు కొనసాగుతున్నాయి. ఈ గడువు మరికొన్ని గంటల్లో పూర్తి కానుంది. అర్హులైన విద్యార్థులు. ఆగస్ట్ 2వ తేదీలోపు పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

ఆగస్ట్ 2వ తేదీలోపు దోస్త్ రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి. ఇందుకు ఆగస్ట్ 3వ తేదీని తుది గడువుగా నిర్ణయించారు. ఇంటర్ స్కోర్ తో పాటు వెబ్ ఆప్షన్ల ఆధారంగా..ఆగస్టు 6వ తేదీన సీట్ల కేటాయింపు ఉంటుంది.

దోస్త్ స్పెషల్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 6 నుంచి ఆన్ లైన్ రిపోర్టింగ్ చేయాలి. ఇందుకు ఆగస్టు 8వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఆగస్టు 6 నుంచే కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసుకోవచ్చు. ఆగస్టు 8 తోనే...