Telangana,hyderabad, ఆగస్టు 1 -- తెలంగాణలోని డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు 'దోస్త్' రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే మూడు విడతలు పూర్తి కాగా. ఖాళీల భర్తీ కోసం స్పెషల్ ఫేజ్ ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల గడువు కూడా జూలై 31వ తేదీతో పూర్తి అయింది. అయితే ఈ గడువు పొడిగిస్తూ అధికారులు తాజాగా నిర్ణయం తీసుకున్నారు.

దోస్త్ స్పెషల్ ఫేజ్ ప్రవేశాల కోసం రిజిస్ట్రేషన్ల గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు. ఆగస్ట్ 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇక వెబ్‌ ఆప్షన్లను ఆగస్ట్ 3వ తేదీ వరకు ఎంచుకోవచ్చు. ఈ విడతకు సంబంధించిన సీట్ల కేటాయింపు ఆగస్ట్ 6వ తేదీన ఉంటుంది.

దోస్త్ స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ లో పాల్గొనేందుకు విద్యార్థులు రూ. 400 చెల్లించాల్సి ఉంటుంది. స్పాట్ అడ్మిషన్లలో భాగంగా సీట్లు పొందే వారికి...