భారతదేశం, సెప్టెంబర్ 13 -- సముద్రపు అలలు తీరాన్ని తాకి వెనుదిరిగినట్టే.. మనిషి జీవితంలో కొన్ని అనుభవాలు మనసును తాకి చెరిగిపోని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి. అలాంటి అనుభూతులనే కథగా మలిచిన నవల చిరాగ్ రచించిన 'తార తీరం'. ప్రేమ, స్నేహం, అనాథత్వం, తల్లిదండ్రుల అనుబంధం, క్రీడా స్ఫూర్తి.. ఇలా భిన్నమైన భావాలను ఒకే కథలో మేళవిస్తూ సాగిన ఈ నవల పాఠకుడిని సూర్య జీవిత ప్రయాణంలో భాగస్వామిని చేస్తుంది.

కొత్తపట్నం బీచ్‌లో అస్తమిస్తున్న సూర్యుడి వర్ణనతో నవల మొదలవుతుంది. నారింజ రంగు ఆకాశం, బంగారు కాంతులు, తీరాన్ని తాకే అలలు, దూరంగా కనిపించే జాలరి పడవలు.. రచయిత వేసిన ఈ దృశ్యచిత్రం కథకు చక్కని నేపథ్యాన్ని ఏర్పరుస్తుంది. 'రెక్కల ప్రపంచం' అనే తొలి అధ్యాయంలో నాలుగేళ్ల సూర్య తన అమ్మ ఆద్యతో కలిసి పేపర్ విమానాలు తయారు చేసి గాలిలోకి ఎగరేస్తాడు. ఆ చిన్నారి ప్రపంచంలో ప్ర...