భారతదేశం, ఆగస్టు 1 -- విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి విద్యుత్ వినియోగదారులపై భారీ భారం పడనుందని, 'ట్రూ-అప్' చార్జీల పేరుతో రూ.12,771 కోట్ల అదనపు భారం మోపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) పేర్కొంది. ఈ అదనపు చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు విజయవాడలో ఒక ప్రకటన విడుదల చేశారు.

విద్యుత్ ఛార్జీలు పెంచడం లేదని చెబుతూనే, మరోవైపు 'ట్రూ-అప్' పేరుతో కొత్త భారాన్ని మోపడం పట్ల సీపీఎం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2019-20 నుంచి 2023-24 వరకు విద్యుత్ రిటైల్ వ్యాపారంలో వచ్చిన లోటును భర్తీ చేసేందుకు డిస్ట్రిబ్యూషన్ కంపెనీలు (డిస్కంలు) రూ.12,771 కోట్లు వసూలు చేయాలని విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వెల్లడిం...