భారతదేశం, ఆగస్టు 10 -- లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ నటించిన 'కూలీ' చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేందుకు సిద్ధమైంది. అడ్వాన్స్ బుకింగ్స్ సంఖ్యలే దీనికి నిదర్శనం. ఆగస్టు 14న విడుదల కానున్న ఈ సినిమా కోసం అంతర్జాతీయంగా కొన్ని రోజుల కిందటే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా, భారత్‌లో శుక్రవారం నుంచి బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే, సినిమా విడుదల కావడానికి ఇంకా నాలుగు రోజులు సమయం ఉండగానే, ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా సుమారు Rs.50 కోట్లు వసూలు చేసింది. భారత్‌లో టికెట్ల కోసం అసలైన ఉత్సాహం ఇంకా మొదలుకావాల్సి ఉంది కాబట్టి, విడుదలయ్యే నాటికి ఈ సంఖ్య రెట్టింపు అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

లోకేష్ కనగరాజ్ రూపొందించిన 'కూలీ' ఈ ఏడాది అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఒకటి. ఇందులో రజినీకాంత్ తో పా...