భారతదేశం, మే 23 -- శనివారం (మే 23) ఉదయం నుంచి కాక్రోచ్ జనతా పార్టీ అధికారిక వెబ్‌సైట్ (cockroachjantaparty.org) పనిచేయడం లేదు. కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది సభ్యులను చేర్చుకుని, ప్రభుత్వ విధానాలపై వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్న ఈ వెబ్‌సైట్‌ను అధికారులు నిలిపివేశారని ఆ పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే ఆరోపించారు. కేవలం వెబ్‌సైట్ మాత్రమే కాకుండా, వారి ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలు హ్యాక్ అయ్యాయని, ఎక్స్ (ట్విట్టర్) ఖాతాపై కూడా ఆంక్షలు విధించారని ఆయన పేర్కొన్నారు.

భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ గతంలో చేసిన 'పరాన్నజీవి' (Parasite) వ్యాఖ్యలకు నిరసనగా ఈ 'కాక్రోచ్ జనతా పార్టీ' వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల అభిజీత్ దిప్కే దీనిని ఒక చిన్న వ్యంగ్య ప్రయోగంగా ప్రారంభించారు. "మమ్మల్ని సోమరిపోతులని, నిరుద్యోగులని, బొద్దింకలని ప...