భారతదేశం, జనవరి 23 -- అమెరికాలో అక్రమ వలసదారుల ఏరివేత చర్యలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి. మిన్నెసోటాలోని కొలంబియా హైట్స్ సబర్బ్‌లో ప్రీ-స్కూల్ ముగించుకుని ఇంటికి వెళుతున్న ఐదేళ్ల బాలుడు లియామ్ కోనెజో రామోస్‌ను ఫెడరల్ ఏజెంట్లు అదుపులోకి తీసుకున్నారు. చిన్న పిల్లాడిని పట్టుకోవడమే కాకుండా, తన తండ్రిని బయటకు రప్పించేందుకు ఆ పసివాడిని 'ఎర'గా వాడుకున్నారని పాఠశాల అధికారులు, కుటుంబ న్యాయవాది సంచలన ఆరోపణలు చేశారు.
స్థానిక కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన జరిగింది. ఇంటి ముందు కారులో ఉన్న లియామ్, అతని తండ్రిని ఏజెంట్లు చుట్టుముట్టారు. "లోపల ఎవరైనా ఉన్నారో లేదో చూడటానికి ఆ పసివాడిని ఇంటి తలుపు తట్టమని అధికారులు చెప్పారు. అంటే ఒక ఐదేళ్ల బాబును వారు ఎరగా వాడుకున్నారు," అని కొలంబియా హైట్స్ పబ్లిక్ స్కూల్స్ సూపర్ టెండెంట్ జెనా స్టెన్విక్ మీడియ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.