భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఆల్మటి డ్యామ్ ఎత్తు పెంపుపై కర్ణాటక ప్రభుత్వం సిద్ధమవ్వటానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఖండించారు. ఈ విషయంపై తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచడానికి లక్షా 30 వేల ఎకరాలు సేకరించడానికి సిద్ధమైందన్నారు. 5 మీటర్ల ఎత్తు పెంచి 100 టీఎంసీల నీటిని నిల్వ చేసుకోవాలని అక్కడి ప్రభుత్వం భావిస్తోందని చెప్పారు.

అదే జరిగితే కృష్ణా నదిలో తెలంగాణ ప్రాంతం వాళ్ళు క్రికెట్ ఆడుకోవడం తప్ప చేసేది ఏం లేదని కవిత వ్యాఖ్యానించారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి ఎత్తు పెంచాలని తీసుకున్న నిర్ణయంపై మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరం తెలిపిందని గుర్తు చేశారు. మహారాష్ట్రలో రెండు జిల్లాలు మునుగుతాయని అక్కడి సీఎం స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణ సీఎంకు మాత్రం మన రాష్ట్రా...