Telangana,gadwal, సెప్టెంబర్ 13 -- కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు. గద్వాల గర్జన పేరుతో నిర్వహించిన బహిరంగ సమావేశంలో మాట్లాడిన ఆయన. పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. దమ్ముంటే ఉప ఎన్నికలకు సిద్ధం కావాలన్నారు.

​"పార్టీలు మారిన ఆ పదిమంది ఎమ్మెల్యేల పరిస్థితి దయనీయంగా ఉంది. అసలు వాళ్లది ఏ పార్టీ అనేది చెప్పుకోలేని దుస్థితి. స్వార్థం కోసం, ఆస్తులు పెంచుకోవడానికే అవకాశవాదంతో పార్టీలు మారారు. ఈ పార్టీ ఫిరాయింపుల అంశంలో సుప్రీంకోర్టు కూడా సీరియస్‌గా ఉంది. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలోని పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ప్రజలే బుద్ధి చెబుతారు" అని కేటీఆర్ ధ్వజమెత్తారు.

"రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే 10 మందితో రాజీనామ...