భారతదేశం, అక్టోబర్ 27 -- పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన 'అర్నబ్' తీవ్ర తుపాను వేగంగా ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తోంది. ఈ నేపథ్యంలో విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా ప్రయాణికులకు అత్యంత కీలకమైన ట్రావెల్ అడ్వైజరీని జారీ చేసింది. తుపాను ప్రభావం వల్ల కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం, విజయవాడ నగరాల నుంచి నడిచే విమాన సర్వీసులకు ఆటంకం కలిగే అవకాశం ఉందని సంస్థ స్పష్టం చేసింది. ప్రతికూల వాతావరణం దృష్ట్యా ప్రయాణికులు విమానాశ్రయాలకు బయలుదేరే ముందు తమ విమాన సమయాలను ఒకసారి సరిచూసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఎయిర్ ఇండియా తమ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. "అర్నబ్ తీవ్ర తుపాను కారణంతో అక్టోబర్ 27న విశాఖపట్నం, విజయవాడ విమానాశ్రయాల నుంచి రాకపోకలు సాగించే విమాన సర్వీసులపై ప్రభావం పడే అవకాశం ఉంది. విమాన ప్రయా...