భారతదేశం, ఆగస్టు 25 -- హైదరాబాద్‌: తెలంగాణలోని రైల్వే స్టేషన్ల రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్' ద్వారా స్టేషన్లలో ప్రపంచ స్థాయి సౌకర్యాలు అందుబాటులోకి వస్తున్నాయని కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి సోమవారం తెలిపారు. దీనికి ఉదాహరణగా ఆయన మహబూబాబాద్ రైల్వే స్టేషన్‌ను ప్రస్తావించారు.

సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 'X'లో కిషన్ రెడ్డి చేసిన పోస్టు ప్రకారం... మహబూబాబాద్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ. 26.49 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో 92 శాతం పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఒకసారి ఈ పనులు పూర్తయితే, స్టేషన్ ఆధునిక సౌకర్యాలతో ప్రయాణికులకు సరికొత్త అనుభూతిని అందిస్తుంది.

"తెలంగాణలోని రైల్వే స్టేషన్లకు అమృత్ భారత్ కింద ప్రపంచ స్థాయి సౌకర్యాలు...