భారతదేశం, ఆగస్టు 17 -- ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్‌కి నామినేట్ అయిన పాలస్తీనియన్ రచయిత్రి ఇబ్తిసామ్ అజెమ్.. తన నవల 'బుక్ ఆఫ్ డిసప్పియరెన్స్'లో పాలిస్తీనియన్లంతా హఠాత్తుగా అదృశ్యమైనట్లు ఊహించుకున్నారు. కానీ, గాజాలో ఇప్పుడు జరుగుతున్న దారుణాలను మాత్రం ఎవరూ ఊహించలేదని ఆమె అంటారు. అసలు గాజా భవిష్యత్తు ఏమిటి? ఏమవుతుంది? అన్న ప్రశ్నలకు ఇజ్రాయెల్ ఏర్పడి 77 ఏళ్లు గడిచినా సమాధానం దొరకలేదు.

గాజా భవిష్యత్తు గురించి కొత్త ప్రణాళికలు పుట్టుకొచ్చాయి. ఎడారిలో ఒక అందమైన నగరాన్ని నిర్మించి, దాన్ని 'మిడిల్ ఈస్ట్ రివేరా'గా పిలవాలని కలలు కంటున్నారు. కానీ, వార్తల్లో వస్తున్న దృశ్యాలు మాత్రం కడుపు మాడిన పిల్లలు, బాంబు దాడుల్లో ధ్వంసమైన ఆసుపత్రులు, చనిపోయిన జర్నలిస్టులను చూపిస్తున్నాయి. ఒక మీడియా టెంట్‌పై కూడా బాంబుదాడి జరిగింది. ఇప్పుడు గాజా నగరాన్ని ఇజ్రాయెల్ ఆ...