భారతదేశం, జూలై 27 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) టయోటా ఇన్నోవా హైక్రాస్.. సరికొత్త రూపంలో అలరించేందుకు సిద్ధమవుతోంది. కంపెనీ ఈ కారు ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌ను భారత రోడ్లపై కవర్‌తో కప్పి, రోడ్ టెస్టింగ్ నిర్వహిస్తూ కనిపించింది. రోడ్ టెస్టింగ్ ప్రారంభం కావడంతో, ఈ కొత్త మోడల్ ఈ ఏడాది చివరిలో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో భారత మార్కెట్లో అధికారికంగా విడుదలయ్యే అవకాశం ఉందని ఆటోమొబైల్ వర్గాలు భావిస్తున్నాయి.

నవంబర్ 2022లో తొలిసారిగా పెట్రోల్, స్ట్రాంగ్ హైబ్రిడ్ ఆప్షన్లలో విడుదలైన ఇన్నోవా హైక్రాస్.. సరిగ్గా అదే టైమ్‌లైన్‌లో ఇప్పుడు కొత్త హంగులతో వచ్చే అవకాశం ఉండటం విశేషం. ఇంజిన్, మెకానికల్ పరంగా ఎలాంటి మార్పులు లేకపోయినప్పటికీ, లుక్స్, డిజైన్, ఇంటీరియర్ పరంగా పలు ఆసక్తికరమైన మార్పులు ఉండనున్నాయి. ...