భారతదేశం, జూన్ 7 -- ​Nagarjuna King 100: టాలీవుడ్ 'మన్మథుడు', అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ల్యాండ్‌మార్క్ 100వ మైలురాయిని అందుకోవడానికి రెడీ అవుతున్నారు. తాత్కాలికంగా 'కింగ్ 100' (Nagarjuna 100th movie) అని పిలుస్తున్న ఈ హై-బడ్జెట్ యాక్షన్ ఎమోషనల్ డ్రామా షూటింగ్ ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. దసరాకు ఈ మూవీని రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

తమిళ దర్శకుడు రా కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ముగింపు షెడ్యూల్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. జూన్ నెలాఖరుకల్లా టోటల్ షూటింగ్‌కు గుమ్మడికాయ కొట్టేసి, జూలై నుండి విజువల్ ఎఫెక్ట్స్ (VFX), పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారు.

​ఈ సినిమాను దసరా పండుగ కానుకగా థియేటర్లలోకి తీసుకురావాలని అన్నపూర్ణ స్టూడియోస్ భావిస్తోంది. అయితే, కేవల...