భారతదేశం, జూన్ 23 -- హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లోని హౌజింగ్ బోర్డుకు చెందిన భూముల బహిరంగ వేలంలో మరోసారి రికార్డు స్థాయి ధరలు పలికాయి. గచ్చిబౌలి ప్రాంతంలోని ఒక కమర్షియల్ ప్లాట్‌ను ఏకంగా రూ.33 కోట్లకు కొనుగోలు చేయడానికి ముందుకు రాగా, మరో చోట రూ. 13.51 కోట్లు పలికింది. రెండు ఎంఐజి ప్లాట్లను కూడా సుమారు 4.50 కోట్లకు పైగా వెచ్చించి బహిరంగ వేలంలో దక్కించుకోడానికి పోటీపడ్డారు. అలాగే చింతల్ ప్రాంతంలోని ప్లాట్లను కూడా కోట్లాది రూపాయలు వెచ్చించి కొనుగోలు చేశారు. మొత్తం 11 ప్లాట్లను వేలం వేయగా రూ.65.02 కోట్ల మేర ఆదాయం వచ్చిందని హౌజింగ్ బోర్డు వైస్ ఛైర్మన్, హౌజింగ్ కమిషనర్ శ్రీ వి.పి.గౌతం తెలిపారు.

నగరంలోని చింతల్, గచ్చిబౌలి, నిజాంపేట తదితర ప్రాంతాల్లో వివిధ రకాలైన ప్లాట్లకు సోమవారం నాడు హౌజింగ్ బోర్డు అధికారులు బహిరంగ వేలం నిర్వహించారు. చింతల్ ప్రాం...