భారతదేశం, జూలై 29 -- దిగ్గజ ఆటోమొబైల్​ సంస్థ హోండా తన అతి చిన్న ఎలక్ట్రిక్ వాహనాన్ని ఆవిష్కరించింది. దాని పేరు ఎన్​-వన్​ ఈ (N-One e). ఇదొక సిటీ డ్రైవ్​ కారు. ఈ కారు సెప్టెంబర్ నాటికి జపాన్​లో అమ్మకానికి రానుంది. త్వరలో యూకేలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో హోండా ఎన్​-వన్​ ఈకి చెందిన వివరాలను ఇక్కడ చూసేయండి..

హోండా ఎన్​-వన్​ ఈ, బ్రాండ్​లోని సూపర్ ఈవీ కాన్సెప్ట్ నుంచి డిజైన్ స్ఫూర్తిని పొందింది. అయితే, నగర వినియోగానికి అనుగుణంగా దీన్ని మాడిఫై చేశారు. ఇది రెట్రో బాక్సీ సిల్హౌట్, గుండ్రటి హెడ్​ల్యాంప్​లు, వంపులు తిరిగిన ఫ్రంట్ బంపర్​ను కలిగి ఉంది. ముందు గ్రిల్ మూసివేసి ఉంటుంది. ఛార్జింగ్ పోర్ట్​ను చక్కగా ఇంటిగ్రేట్ చేశారు. ఇది ఏరోడైనమిక్స్​ను ఆప్టిమైజ్ చేయాలనే లక్ష్యంతో ఉన్న చిన్న ఈవీలలో సాధారణ లక్షణం.

ఈ బుడ్డి ఎలక్ట్రిక్​ కారు డై...