భారతదేశం, సెప్టెంబర్ 22 -- హైదరాబాద్‌లోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన ఒక యువతి హోటల్ గదిలో తీవ్ర గాయాలతో ప్రియుడు తీసుకెళ్లాడు. ఆమెను ఆసుపత్రిలో చేర్పించిన ప్రియుడు అక్కడి నుండి పరారయ్యాడు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నానికి చెందిన 29 ఏళ్ల యువతి, ఆమె ప్రియుడు కలసి సోమవారం మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో మాదాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని సిద్ధిఖీ నగర్‌లో ఉన్న ఒక హోటల్‌లో గదిని అద్దెకు తీసుకున్నారు. ఆ యువతి నగరంలోని ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. అయితే మంగళవారం నాటికి వీరి కథ ఊహించని మలుపు తిరిగింది.

యువతి స్పృహతప్పి పడిపోవడంతో హోటల్ సిబ్బంది సహాయంతో ఆమె ప్రియుడు వెంటనే కొత్తగూడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించాడు. ఆసుపత్రిలో పరీక్షించిన వైద్యులు, ఆ యువతి అప్ప...