భారతదేశం, జనవరి 15 -- ఎంబీఏ ప్రవేశాల కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ నుంచి అడ్మిషన్ నోటిఫికేషన్ జారీ అయింది. రెండేళ్ల మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (ఎంబీఏ) ఫుల్ టైం ప్రోగ్రామ్ లో అడ్మిషన్లు కల్పిస్తారు. మొత్తం 75 సీట్లు అందుబాటులో ఉన్నాయి. అర్హులైన అభ్యర్థులు జనవరి 31వ తేదీలోపు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
ఎంబీఏ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా విభాగంలో డిగ్రీ కలిగి ఉండాలి. దరఖాస్తులను షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. అయితే ఈ అడ్మిషన్ల కోసం క్యాట్ 2025 లేదా ఏఐఎంఏ నిర్వహించిన ఎంఏటీ-2025 లేదా NTA నిర్వహించిన సీఎంటీఏ-2026లో హాజరైన అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులవుతారు.
Published by HT Digital Content Services with permission...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.