భారతదేశం, ఏప్రిల్ 7 -- హైదరాబాద్ విమానాశ్రయంలోని ఏరోబ్రిడ్జ్ పైకప్పు నుంచి ఒక పెద్ద మెటల్ ప్యానెల్ కిందపడింది. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ప్రయాణికుడి తలపై పడటంతో, అతనికి అంతర్గత గాయాలై, తల తిరుగుతున్నట్లుగా ఫీలయ్యాడు. పని నిమిత్తం భారతదేశానికి వచ్చాడు అమెరికా పౌరుడు దీపక్ అడోని. బెంగళూరు నుంచి వచ్చిన విమానం నుంచి బయటకు వచ్చిన ప్రయాణికులలో తాను కూడా ఒకడినని పీటీఐకి తెలిపాడు.

'నేను కొన్ని అడుగులు వేయగానే ఆ బరువైన ప్యానెల్ నా తలపై పడింది. నన్ను ఏది తాకిందో తెలియక నిల్చోవడానికి రెయిలింగ్‌ను పట్టుకున్నాను.' అని 63 ఏళ్ల అడోని చెప్పారు.

అడోని ఏరోబ్రిడ్జ్ గోడకు ఆనుకుని ఉండగా, అతని వెనుక ఉన్న జైనాబ్ సయ్యద్ అనే యువతి సహాయం కోసం పరుగెత్తుకొచ్చి, కేకలు వేసింది. సుమారు 30 నిమిషాల తర్వాత అడోనిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు. వైద్యుని నివేదిక ప్ర...