భారతదేశం, మే 19 -- భాగ్యనగరం ఐటీ, కార్పొరేట్ రంగాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. కేవలం బహుళజాతి కంపెనీలే కాకుండా, వాటికి అవసరమైన ఆఫీస్ వసతులను కల్పించే 'మేనేజ్డ్ వర్క్ స్పేస్' సంస్థలు కూడా ఇక్కడ తమ పెట్టుబడులను ముమ్మరం చేస్తున్నాయి. తాజాగా టేబుల్ స్పేస్ సంస్థ హైదరాబాద్‌లో తన పోర్ట్‌ఫోలియోను భారీగా పెంచుకుంది. ఇందులో భాగంగా కోకాపేటలోని నియోపోలిస్, హైటెక్ సిటీ ప్రాంతాల్లో భారీ విస్తీర్ణంలో ఆఫీస్ స్పేస్‌ను అందుబాటులోకి తెచ్చింది.

హైదరాబాద్‌లో ప్రస్తుతం హాట్ కేకులా మారుతున్న ప్రాంతం కోకాపేట. ఇక్కడి నియోపోలిస్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌లోని 'గ్రావా బిజినెస్ పార్క్' (Grava Business Park)లో టేబుల్ స్పేస్ ఏకంగా 4 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని లీజుకు తీసుకుంది. టవర్ 10, 20లలో ఈ కార్యాలయం విస్తరించి ఉంది.

నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్ (ORR)కు ఉన్న అద్భుతమైన ...