హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 నుంచి వరంగల్ ఎయిర్పోర్ట్ వరకు.. ప్రధాని మోదీకి రేవంత్ రెడ్డి విజ్ఞప్తులు
భారతదేశం, జూన్ 12 -- తెలంగాణ రాష్ట్రానికి కీలకమైన పలు మౌలిక వసతుల ప్రాజెక్టులపై కేంద్రం సహకారం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరారు. సాగు, తాగునీటి అవసరాల దృష్ట్యా గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేలా మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర భవిష్యత్తు అవసరాలకు గోదావరి జలాల వినియోగం అత్యంత ముఖ్యమని చెప్పారు. నీతి ఆయోగ్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని కలిసి హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 విస్తరణతోపాటు పలు ప్రతిపాదనలను అందించారు.
మెట్రో ఫేజ్-2లో 7 కారిడార్లలో 122.9 కిలోమీటర్ల మెట్రో విస్తరణకు రూ.38,595 కోట్ల ప్రతిపాదనలు సమర్పించినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా మంజూరు చేయాలని కోరారు.
హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డు పనులకు వెంటనే ఆమోదం తెలపాలని...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.