భారతదేశం, సెప్టెంబర్ 30 -- హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. నాలుగు సంవత్సరాలుగా ఆర్టీసీ ఎండీగీ బాధ్యతలు నిర్వహించారు సజ్జనార్. ఆర్టీసీలో ఎన్నో కీలక మార్పులను తీసుకొచ్చారు. తనదైన ముద్ర వేసుకున్నారు. మూడు రోజుల కిందట ప్రభుత్వం హైదరాబాద్‌ సీపీగా సజ్జనార్‌ను బదిలీ చేయగా.. మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటిదాకా సీపీగా ఉన్న సీవీ ఆనంద్‌ను హోంశఆఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ట్రాన్స్‌ఫర్ చేసింది ప్రభుత్వం.

1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి గతంలో ఆంధ్రప్రదేశ్ కేడర్ కు చెందిన ఆయన, తరువాత తెలంగాణకు కేటాయించబడ్డారు. దాదాపు మూడు దశాబ్దాల పాటు కీలకమైన పోలీసింగ్, పరిపాలనా పదవుల్లో సేవలందించిన సజ్జనార్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత నల్గొండ, కడప, గుంటూరు, వర...